విజయ్ దేవరకొండ… అనతికాలంలోనే స్టార్డమ్ పొందిన నేటితరం కథానాయకుడు. ఏ ఏడాదికేడాది తన స్థాయిని పెంచుకుంటూ తారాపథంలో దూసుకుపోతున్నాడీ యూత్ ఐకాన్. అంతేకాదు… తను ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడే తన కుటుంబం నుంచి మరో టాలెంటెడ్ హీరోని తెలుగు పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు విజయ్. ఆ టాలెంటెడ్ హీరో మరెవరో కాదు… విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అంతేకాదు… ఈ అన్నదమ్ముల చిత్రాలు ఒకే నెలలో మూడు వారాల గ్యాప్లో రిలీజ్ కాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ఆనంద్ దేవరకొండ , శివాత్మిక (సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కూతురు) జంటగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఈ సినిమాకి కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాతలలో ఒకరైన యష్ రంగినేని.. మరో నిర్మాత ‘మధుర’ శ్రీధర్తో కలసి సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
కాగా.. ఇదే నెలలో అంటే జూలై 26న విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ కూడా విడుదల కానుంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.మరి… మూడు వారాల గ్యాప్లో రానున్న ఈ అన్నదమ్ములు… ఆ యా చిత్రాలతో ఘన విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.
[subscribe]
[youtube_video videoid=bLGsvexDn1s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: