కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. ఆరంభంలో కమర్షియల్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ ద్వయం… ఆ తరువాత భక్తిరస చిత్రాల బాట పట్టి ప్రేక్షకులను మైమరపించారు. అలా… వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వేంకటేశ్వరస్వామిని తన కీర్తనలతో ఆడించి, పాడించిన అన్నమయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా… నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. నాగార్జునకి జోడీగా రమ్యకృష్ణ, కస్తూరి నటించిన ఈ చిత్రంలో సుమన్ శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రలో దర్శనమివ్వగా… భానుప్రియ, శ్రీకన్య, మోహన్‌బాబు, రోజా, బాలయ్య, శుభ, సుత్తి వేలు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.
జె.కె.భారవి అందించిన కథకు స్వరవాణి కీరవాణి తన సంగీతంతో ఊపిరి పోశాడు. తనకు మాత్రమే సొంతం అన్నట్టుగా… అన్నమయ్య కీర్తనలను సైతం సామాన్య ప్రజానీకం పాడుకునే విధంగా బాణీలు కట్టి తనదైన మార్కు సంగీతంతో శ్రోతలను ఉర్రూతలూగించాడు కీరవాణి. అంతేకాదు… ఈ చిత్రంతో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు కీరవాణి. పలు నంది, ఫిల్మ్‌పేర్ పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని వి.ఎం.సి.ప్రొడక్షన్స్ పతాకంపై వి.దొరస్వామిరాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. 1997 మే 22న విడుదలై ఘన విజయం సాధించిన ‘అన్నమయ్య’… నేటితో 22 వసంతాలను పూర్తి చేసుకుంది.
అన్నమయ్య ఫుల్ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడండి. 👇
[subscribe]
[youtube_video videoid=q82xOJztnRY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: