యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఈ సినిమాతోనే సీనియర్ నటుడు రాజశేఖర్ రెండో తనయ శివాత్మిక కూడా హీరోయిన్గా పరిచయం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ‘దొరసాని’… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా… ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మధుర
శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి అన్న విజయ్ దేవరకొండ లాగే… తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: