‘మన్మథుడు’… కింగ్ నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం. 2002లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘మన్మథుడు 2’ తెరకెక్కుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నాగ్ కోడలు, నటి సమంత అతిథి పాత్రలో దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు… ఇప్పటికే సమంత పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం. కాగా… తాజాగా సామ్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.. ‘మన్మథుడు’ చిత్రంలో అభిరామ్ (హీరో పాత్ర పేరు) అమ్మాయిలను ఎందుకు ద్వేషిస్తున్నాడో తెలిపే పాత్రలో తనికెళ్ళ భరణి నటించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే… హీరో తాలూకు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే అలాంటి పాత్రే… ‘మన్మథుడు 2’లో కూడా ఉంటుందట. ఆ రోల్లోనే సామ్ కనిపించనుందట. మన్మథుడు
లో స్త్రీ ద్వేషిగా నాగ్ కనిపిస్తే.. మన్మథుడు 2
లో అందుకు భిన్నంగా సాగే పాత్రలో తాను దర్శనమిస్తాడట. ఇంకా చెప్పాలంటే… అమ్మాయిలతో చాలా చొరవగా ఉంటూ… వారికి ఏ సమస్య ఉన్నా తీర్చే హెల్పింగ్ నేచర్
ఉన్న బాస్‌గా నాగ్ పాత్ర ఉంటుందట.
అమ్మాయిల్ని అసహ్యించుకునే వ్యక్తి కాస్త… వాళ్ళకి సంబంధించిన ప్రతీ విషయంలో ఇలా ఎందుకు సాయపడుతున్నాడో చెప్పే పాత్రలో సమంత కనిపించనుందట. సామ్ పాత్ర వెండితెరపై కనిపించేది కాసేపైనా… ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. మరి… మావయ్య సినిమాకి ఈ కోడలి పాత్ర ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=j7B34XDQ3Bo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: