మహానటుడు యన్.టి.రామారావు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుది విజయవంతమైన జోడి. ‘చంద్రహారం’(1954)తో మొదలైన వీరి ప్రయాణం… ‘శ్రీకృష్ణ విజయం’(1971) వరకు సాగింది. అలా.. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘రేచుక్క పగటిచుక్క’ ఒకటి. యన్.టి.రామారావు, యస్.వి.రంగారావు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో… యన్టీఆర్ సరసన ‘షావుకారు’ జానకి కథానాయికగా నటించారు. యస్.వరలక్ష్మి అతిథి పాత్రలో దర్శనమివ్వగా…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నాంబ, సి.ఎస్.ఆర్, ఆర్.నాగేశ్వరరావు, ‘చిత్తూరు’ నాగయ్య, రాజనాల తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సముద్రాల జూనియర్ రచించిన గీతాలకు… యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పన చేసారు. వాటిలో “మనవి సేయని”, “కాదా అవునా” పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. యన్.త్రివిక్రమరావు అందించిన కథకు సముద్రాల జూనియర్ మాటలు బాగా ప్లస్ అయ్యాయి. 1959 మే 14న విడుదలై అనూహ్య విజయం సాధించిన ‘రేచుక్క పగటిచుక్క’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























