ఆరు నెల‌ల గ్యాప్‌లో చిరు చిత్రాలు?

Chiranjeevi Coming Up With 2 Movies in 6 Months Gap,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Chiranjeevi Next Project Details,Chiranjeevi New Movie Updates,Mega Star Chiranjeevi Upcoming Film News,Chiranjeevi Next With 2 Movies in 6 Months Gap
Chiranjeevi Coming Up With 2 Movies in 6 Months Gap

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉందీ సినిమా. జూన్ కల్లా షూటింగ్‌ పూర్తి చేసి… అనంత‌రం నిర్మాణానంత‌ర‌ కార్య‌క్ర‌మాల పై దృష్టి సారించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇకపోతే… ‘సైరా’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే… తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో చిరు ఉన్నట్టు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… చిరు తన అప్‌కమింగ్ ఫిల్మ్ ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో చేయబోతున్న విషయం తెలిసిందే. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… ఈ సినిమాని దశల వారిగా పూర్తి చేసే విధంగా చిరు ప్లాన్ చేసార‌ట. ఈ సినిమాని జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ప్రారంభించి… ఆ త‌ర్వాత ‘సైరా’ ప్రమోషన్ కోసం కొంత బ్రేక్ ఇవ్వనున్నార‌ట మెగాస్టార్‌. ‘సైరా’ విడుదల అనంతరం మళ్ళీ కొరటాల సినిమా పై పూర్తిగా ఫోకస్ పెట్టే విధంగా చిరు ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే… సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని పూర్తి చేసి… వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. కాగా… త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్త‌మ్మీద‌… ద‌స‌రా సీజ‌న్‌లో సైరాతో, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో కొర‌టాల మూవీతో చిరు సంద‌డి చేయ‌నున్నార‌న్న‌మాట‌. మ‌రి… ఆరు నెల‌ల గ్యాప్‌లో వ‌స్తున్న చిరు ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తారో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=Xt7j28oBAh8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.