‘సాహో’ టాకీ పూర్తి

Prabhas Saaho completes Mumbai Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Saaho Movie Latest Updates,Saaho Telugu Movie Completes Talkie Parts,Saaho Movie Shooting Updates,Saaho Completes Talkie Parts
Prabhas Saaho completes Mumbai Schedule

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీ… ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీంతో… ఒక పాట మినహా టాకీ పార్టు మొత్తం పూర్తయింది. కాగా…విదేశాల్లో ఆ గీతాన్ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ని స‌మాచారం. కాగా… మ‌రోవైపు నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉన్నత సాంకేతిక విలువలతో పాటు హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ సన్నివేశాలతో ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెరకెక్కించినట్టు చిత్ర బృందం చెబుతోంది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటించిన‌ ఈ చిత్రంలో అరుణ్ విజయ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ‘వెన్నెల’ కిషోర్, మురళీశర్మ త‌దిత‌రులు ముఖ్య భూమికలను పోషించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్, ఎహ్‌సాన్, లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం… స్కై హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]


[youtube_video videoid=2UqswPJbzzA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.