షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’

Dear Comrade Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Dear Comrade Movie Shooting Completed,Dear Comrade Movie Shooting Updates,Vijay Deverakonda New Movie Shoot Wrapped Up,Dear Comrade Movie Shoot,Dear Comrade Movie Shoot Finished
Dear Comrade Movie Shoot Wrapped Up

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేష‌న‌ల్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన‌ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘గీత‌గోవిందం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఈ జంట క‌ల‌సి న‌టించిన‌ సినిమా కావ‌డంతో… ‘డియర్ కామ్రేడ్’పై ప్రేక్ష‌కుల్లో మంచి ఆస‌క్తి నెల‌కొంది. నూత‌న ద‌ర్శ‌కుడు భరత్ కమ్మ రూపొందించిన‌ ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు బిగ్ బెన్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మించింది. మళయాళ చిత్రం ‘ప్రేతమ్’ ఫేం శ్రుతి రామచంద్రన్ ఓ కీలకపాత్రను పోషించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏక‌కాలంలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింద‌ని స‌మాచారం. అలాగే… ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

కాగా… ఇందులో స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉన్న యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌నుండ‌గా… క్రికెట‌ర్ లిల్లీ పాత్ర‌లో ర‌ష్మిక ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]


[youtube_video videoid=4BRnD6to5dY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =