బాలీవుడ్ రీమేక్ లో సూపర్ డీలక్స్

Super Deluxe To Be Remade in Bollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Deluxe in Bollywood Remake,Super Deluxe Movie Latest Updates,Super Deluxe Movie Hindi Remake on Charts,Bollywood Remake of Super Deluxe
Super Deluxe To Be Remade in Bollywood

టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, విజయసేతుపతి, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. గత నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి… కాదు కాదు ఆ పాత్రల్లో జీవించి మరీ పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఈ సినిమా అంత మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శిల్పా అనే హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక రమ్యకృష్ణ అయితే మొదటి సారి వేశ్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించిన రమ్యకృష్ణ అందరినీ ఆకట్టుకుంది. ఇక సమంత కూడా పెళ్లయిన తరువాత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తను చంపే మహిళా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. త్యాగరాజ కుమారరాజా ద‌ర్శ‌క‌త్వంలోనే రీమేక్ తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నేపథ్యంలో విజ‌య్ సేతుప‌తి, సమంత, రమ్యకృష్ణ పాత్రలకు ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి. మరి తమిళ్ లో ఘన విజయం సాధించిన ఈ సినిమా అక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]


[youtube_video videoid=ILY3zkBenNU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.