శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత చిత్రలహరి, జెర్సీ, కాంచన సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కొన్ని థియేటర్లలో మజిలీ కలెక్షన్స్ మాత్రమే బాగానే రాబడుతుంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రిలీజై పదిహేడు రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం మొత్తం పదిహేడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ ను అలాగే 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ఈ పదిహేడు రోజుల్లో మజిలీ రాబట్టిన షేర్ ఏంతో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మజిలీ 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు:
నైజాం – 12.05 కోట్లు
సీడెడ్ – 4.08 కోట్లు
గుంటూరు – 2.01 కోట్లు
యూఏ – 4.07 కోట్లు
తూర్పు గోదావరి – 1.65 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.27 కోట్లు
కృష్ణా – 1.75 కోట్లు
నెల్లూరు – 0.84 కోట్లు
కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా- 4.02 కోట్లు
యూఎస్ఏ – 3.85 కోట్లు
టోటల్ మజిలీ 17రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – గ్రాస్ 60.05 కోట్లు, 35.57 కోట్లు షేర్
[subscribe]
[youtube_video videoid=kbk2PJh9KYI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























