సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి మూవీ షూటింగ్ పూర్తి అయింది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై రూపొందుతున్న మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి మే నెల 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి మూవీ లో మూడు డిఫరెంట్ లుక్స్ లో నటించిన మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా తన ఇన్ స్టా గ్రామ్ లో “విత్ దిస్ .. ఇట్స్ ర్యాప్ .. సీయూ ఇన్ ది సినిమాస్ ఆన్ మే 9” అంటూ మెసేజ్ షేర్ చేశారు . టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న మహర్షి మూవీ ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీ తరువాత రిలీజవుతున్న మహర్షి మూవీ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
[subscribe]
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: