వర్మ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ రిలీజ్

RGV Cobra First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Cobra Movie First Look,#CobraFirstLook,First Look of Cobra Movie,RGV New Movie Cobra First Look,RGV Cobra Movie Latest Updates,Cobra Telugu Movie First Look
RGV Cobra First Look Out Now

మొన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ… ఇప్పుడు కోబ్రా అంటూ మరో సంచలన సృష్టించడానికి వస్తున్నాడు. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఒక డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా.. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ.. పాటలు పాడటం ఇలా తనకు ఏది నచ్చితే అది చేసి పలు అవతారాలు ఎత్తిన వర్మ…ఇప్పుడు నటుడిగా మారి అందరికీ షాకిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన పుట్టిన రోజు సందర్భంగా ‘కోబ్రా’అనే టైటిల్ ను ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.  మరి పోస్టర్ లో సీరియస్ లుక్ తో వర్మ లుక్ ఆకట్టుకుంటుంది. మరి పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఓ డేంజరస్ క్రిమినల్ కు సంబంధించిన స్టోరీలాగ కనిపిస్తోంది.. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం ఇప్పుడే తెరపైకి వచ్చిన ఈ సినిమా ముందు ముందు ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో.

ఇక ఇదిలా ఉండగా.. వర్మ లుక్ పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వర్మ లుక్ పై స్పందించి.. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “ఫైనల్ గా సర్కార్ రామ్ గోపాల్ వర్మ… అసలైన రూట్ కొచ్చారు…ఆల్ ది బెస్ట్ సర్కార్… డామ్… నాకు ఇంకొకరు పోటీకి వచ్చారు ” అని ట్వీట్ చేశారు. అమితాబ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అమితాబ్ తో పాటు జూనియర్ బచ్చన్ అభిషేక్, సుదీప్ పలువురు ట్వీట్స్ చేశారు.

 

 

 

[subscribe]

[youtube_video videoid=5UZs2wGqKq0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.