‘మున్నా’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. మొదటి సినిమా నిరాశపరిచినా… రెండో చిత్రం ‘బృందావనం’తో తొలి విజయాన్ని అందుకున్నాడు వంశీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత ‘ఎవడు’, ‘ఊపిరి’… ఇలా మరో రెండు విజయాలను తన కైవసం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’… వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న చిత్రం ‘మహర్షి’.
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… వంశీ పైడిపల్లి కి తొలి విజయాన్ని అందించిన ‘బృందావనం’ రాజేంద్ర ప్రసాద్ నటించిన పాత సినిమా ‘బృందావనం’ టైటిల్ ని రిపీట్ చేస్తే.. ఇప్పుడు వస్తున్న ‘మహర్షి’ సీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన అలనాటి ‘మహర్షి’ టైటిల్ ని రిపీట్ చేస్తోంది. మరి ‘బృందావనం’ టైటిల్ కలిసి వచ్చినట్టే.. ‘మహర్షి’ టైటిల్ కూడా మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=JkgaqwfiH-Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























