చిరు, కొర‌టాల మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

2019 Latest Telugu Movie News, Chiranjeevi 152 Movie News, Chiranjeevi Next Movie Updates, Interesting Updates on Chiranjeevi and Koratala Siva New Movie, Mega Star Chiranjeevi 152nd Movie Latest Update, Mega Star Chiranjeevi New Project Details Revealed, Telugu Filmnagar, Telugu FilmUpdates, Tollywood Cinema News
Mega Star Chiranjeevi 152nd Movie Latest Update

మెగాస్టార్ చిరంజీవి త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామా… విజ‌య ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే త‌న‌ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు చిరు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్క‌నుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ నెలాఖ‌రున ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల‌ను లాంఛ‌నంగా జ‌రిపి… జూన్ నుంచి నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపే దిశ‌గా యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ లోగా ప్రీ ప్రొడ‌క్ష‌న్స్ లో భాగంగా క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు కొర‌టాల‌. అలాగే… స్క్రిప్ట్ వ‌ర్క్ తాలూకు తుది మెరుగులు కూడా దిద్ద‌నున్నారాయ‌న‌. చిరు, కొర‌టాల మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

[youtube_video videoid=tJcvr2KdTOU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.