సాహో మూవీ జపనీస్ లో కూడా!

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ‘సాహో’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈసినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షెడ్స్ ఆప్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వీడియోలు రిలీజ్ చేయగా అవి మిలయన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటితో పాటు జపనీస్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా ప్రభాస్, శ్రద్దా కపూర్ తో పాటు ఇంకా ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన `సాహో` విడుద‌లచేయనున్నారు.

మరి ‘బాహుబలి’ సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న‌ చిత్రం ‘సాహో’ కావడంతో ఈసినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులే కాదు..ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.