2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. ఇక ఆతరువాత దాని సీక్వెల్ లో తీసిన కాంచన, గంగ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు మరోసారి కాంచన 3 అనే సీక్వెల్ తో భయపెట్టడానికి వస్తున్నాడు. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న ఈసినిమాను.. తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఇప్పటివరకూ విడుదలైన మూడు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. మరి కాంచన 3 ఎలా ఉంటుందో చూద్దాం.
[youtube_video videoid=s01YohDdGZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























