ల‌క్కీ డేట్‌కి ప్రారంభం కానున్న సూప‌ర్ స్టార్ కొత్త చిత్రం?

Rajinikanth New Movie To Be Launched On A Special Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth New Movie Updates,Super Star Rajinikanth New Film Launch Date,Rajinikanth Next Film News,Rajinikanth Upcoming Telugu Movies
Rajinikanth New Movie To Be Launched On A Special Date

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. కాగా… ఈ సంక్రాంతికి `పేట‌`తో ప‌ల‌క‌రించిన ర‌జినీ… ప్ర‌స్తుతం కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. పాన్ – ఇండియా డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. ర‌జినీకి జోడీగా న‌య‌న‌తార, కీర్తి సురేష్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ స్వ‌రాలు అందించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్రమాలను ఏప్రిల్ 10 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఏప్రిల్ 10 సూప‌ర్ స్టార్‌కి ల‌క్కీ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే… గ‌తంలో అదే రోజున `అరుణాచ‌లం` (97), `ప‌డ‌య‌ప్పా` (న‌ర‌సింహా) (99) చిత్రాలు విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌గా నిలిచాయి. మ‌రి… అదే ఏప్రిల్ 10న ప్రారంభం కానున్న ర‌జినీ కొత్త చిత్రం కూడా సంచ‌లనాల‌కి కేంద్ర బిందువుగా నిలుస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=h2K6y-aVFD8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.