ర‌వితేజ `వెంకీ`కి 15 ఏళ్ళు

15 years For Ravi Teja Venky Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Venky Movie Completes 15 Years, 15 Years For Venky Movie,Mass Maharaja Ravi Teja Venky Movie Latest News,15 Years Completed For Ravi Teja Venky Movie
15 years For Ravi Teja Venky Movie

`మాస్‌తో పెట్టుకుంటే మ‌డ‌తెడిపోద్ది`… అనే మేన‌రిజ‌మ్‌తో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సంద‌డి చేసిన చిత్రం `వెంకీ`. సోలో హీరోగా ర‌వితేజ న‌టించిన తొలి చిత్ర‌మైన `నీ కోసం` ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ‌ను వైట్ల‌… సుదీర్ఘ విరామం త‌రువాత ర‌వితేజ‌ని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగిన ఈ సినిమాలో ర‌వితేజకి జోడీగా స్నేహ న‌టించగా… ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో బ్ర‌హ్మానందం, అశుతోష్ రాణా, శ్రీ‌నివాస రెడ్డి, చిత్రం శ్రీ‌ను, ఏవీయ‌స్‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు న‌టించారు. రాశి ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన బాణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ముఖ్యంగా `గోంగూర తోట‌కాడ‌`, `మాస్‌తో పెట్టుకుంటే` పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు నిర్మించిన ఈ సినిమా 2004 మార్చి 26న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. నేటితో ఈ చిత్రం 15 వ‌సంతాలు పూర్తిచేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=tTnZDLGpMro]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.