ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సిమానాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు మహేష్ బాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యులతో పాటు.. మహేష్ బాబు అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అభిమానులకు కూడా మైనపు ప్రతిమతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు మైనపు ప్రతిమను తరలిస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మే 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=MfCxdchXOB8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























