నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్సే ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక రీసెంట్ గా రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడం.. దానికి తోడు ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న ఈసినిమా విడుదల కావడం కఫ్టంగా మారిందని టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయిన టీం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై పలు వార్తలు వస్తున్నాయని.. అవన్నీ ఒట్టి రూమర్లే అని ఏప్రిల్ 5వ తేదీనే సినిమా రిలీజవుతుందని .. షైన్ స్క్రీన్స్ సంస్థ ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది.

[youtube_video videoid=NWz9pdR3reQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























