ఇట్లు అర్జున విడుదలకు రెడీ

Itllu Arjuna All Set to Hit Theatres After Censor Clearance

అక్కినేని నాగార్జున సమర్పణలో, వెంకీ కుడుముల తన కొత్త బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై నిర్మించిన వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఇట్లు అర్జున’విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా మేకింగ్ మరియు భావోద్వేగాలు చాలా బాగా వచ్చాయని సెన్సార్ టాక్ రావడంతో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేయడంతో పాటు, ప్రత్యేకంగా ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ వీడియో బైట్‌ను విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. మరోవైపు, ఇటీవల జరిగిన గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్‌కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ నాగార్జున, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి ఘనంగా మద్దతు తెలిపారు.

అనీష్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మాటలు లేని ఒక మూగ యువకుడిగా హీరో సాహసోపేతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్. తమన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, సినిమాపై ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ ఏర్పడింది. టాలీవుడ్ ప్రముఖుల సపోర్ట్, సరికొత్త ప్రమోషనల్ కంటెంట్‌తో దూసుకుపోతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం ఎల్లుండి థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.