ఇట్లు అర్జున అనీష్ నటనపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం

Ram Charan Pours Praise on Aneesh’s Performance in ItlLu Arjuna

మ్యూజికల్ కాన్సర్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి, మా అభిమానులందరికీ థాంక్యూ సో మచ్. అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రులు చాలా అద్భుతమైన వ్యక్తులు. అనీష్‌కు సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. తనకు మరో పెద్ద సపోర్ట్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారి లాంటి సపోర్ట్ ఉంటే తప్పు జరగడానికి అవకాశం లేదు. నాగార్జున గారు ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అనీష్‌ను కూడా ఎంకరేజ్ చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్. అనస్వర చాలా అద్భుతమైన నటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కాకా’ సినిమాలో కూడా తను చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ‘ఇట్లు అర్జున’తో తనకు ఒక బ్లాక్‌బస్టర్ వస్తుంది. అలాగే సంక్రాంతికి ‘కాకా’తో మరో బ్లాక్‌బస్టర్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు, తన మ్యూజిక్‌తో లక్షల మందిని కనెక్ట్ చేస్తాడు. అది పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనేది చూడడు. అందరికీ ఒకేలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో పాటలన్నీ చాలా బాగున్నాయి. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు. తన ప్రతి సీన్‌ను చాలా అద్భుతంగా చేశాడు.

తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేం. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద అడుగు కావాలి. తన భవిష్యత్తు విజయాలకు ఇది మంచి పునాది కావాలి. అనీష్ తన తల్లిదండ్రులను, ప్రేక్షకులను గర్వపడేలా చేస్తాడని ఆశిస్తున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.