వృషకర్మ ఫస్ట్ సింగిల్ అప్డేట్

Vrushakarma First Single Update

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.

నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు మరింత రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి.  అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఫస్ట్ సింగిల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా సాధించింది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ‘వృషకర్మ’పై పాజిటివ్ బజ్ నెలకొంది.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.