ఇట్లు అర్జున ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

Jr NTR to Launch Itlu Arjuna Trailer

సాయి అనీశ్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కింగ్ నాగార్జున సమర్పిస్తుండగా, వెంకీ కుడుముల ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను టాలీవుడ్ టాప్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైరన్ ఎన్టీఆర్ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.ఈరోజు సాయంత్రం 4 :02 గంటలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తారక్ లాంచ్ చేయబోయే ఈ ట్రైలర్ సినిమాపై మరింత పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.