హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. లవ్ యు. మనందరం ఒక్కటే. వి ఆర్ వన్ ఫ్యామిలీ. మీరందరూ నాకు అన్‌కండిషనల్ లవ్ ఇచ్చారు. ఈ ఏడాదిలో మిమ్మల్ని కలవడం ఇది మూడోసారి. దీన్ని ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. కానీ నాగార్జున గారు ఇంతకుముందే ఇతర భాషల డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. అన్ని ఇండస్ట్రీలను కలుపుకుంటూ వర్క్ చేసేవారు. మణిరత్నం గారు, ప్రియదర్శన్ గారు, మహేష్ భట్ గారు.. ఇలా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు. అది ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’లో చాలా భాషలకు చెందిన నటీనటులు కలిసి పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చాడు. ఇప్పుడు జిత్తుతో కలిసి ‘సీన్’ చేశాను. తన ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలను మీరు చూసే ఉంటారు. ‘సీన్’ కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమా. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత మరోసారి మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది. మీ అందరి ప్రేమకు థాంక్యూ. మా టీమ్ సభ్యులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను అందిస్తున్నాం. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్నెస్, నవ్వులు.. అన్నీ ఉన్నాయి. రాకేందు మౌళి తెలుగులో చాలా చక్కని మాటలు, పాటలు రాశారు. చాలా కమిట్మెంట్తో పనిచేశారు. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ టాలెంట్ కూడా ఉంది. నజ్రియాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా అద్భుతమైన నటి. తను నేచురల్ స్టార్. ఈ సినిమాలో తను స్టంట్స్ కూడా చేసింది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో ఒక డైలాగ్ ఉంది. అది నిజంగా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ‘సీన్’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. లవ్ యు ఆల్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























