బిగ్‌బాస్ హౌస్‌లో డబుల్ ధమాకా.. ఏడో వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దరు అవుట్

Bigg Boss House Witnesses Double Elimination in Week 7

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో వారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎలిమినేషన్ వేళ హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లకు బిగ్ షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఓటింగ్ మరియు హౌస్‌మేట్స్ నిర్ణయం ఆధారంగా దక్షణ , షాలిని ఇద్దరూ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆడియెన్స్ ఓటింగ్ పరంగా అతి తక్కువ ఓట్లు సాధించిన వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్షి ముందుగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చింది. తన ప్రయాణం స్వల్పమే అయినప్పటికీ చివరి వరకు ఎంతో పాజిటివ్‌గా, చిరునవ్వుతో దక్షి వీడ్కోలు పలికింది. మరోవైపు హౌస్‌లో రెడ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మిగిలిన షాలినిని సాగనంపేందుకు హౌస్‌మేట్స్ ఓటింగ్ నిర్వహించగా, తీవ్రమైన ఓటింగ్ డ్రామా మధ్య షాలిని ఎలిమినేట్ అయింది.

సీక్రెట్ రూమ్‌కి వెళ్లి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా షాలిని ప్రవర్తనలో మార్పు రాలేదని, గేమ్‌పై దృష్టి పెట్టలేకపోయిందనే కారణంతో హౌస్‌మేట్స్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ డబుల్ ఎలిమినేషన్ హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లకు గట్టి హెచ్చరికలా మారగా, రాబోయే వారాల్లో ఆట మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.