జైలర్ 2 సక్సెస్: డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన చిరంజీవి

Chiranjeevi Extends Congratulations to Cinematographer Vijay Kartik Kannan

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ డీవోపీ పని చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కార్తీక్, ఆయన టీమ్‌ను అభినందించారు.

విజయ్ కార్తీక్ డీవోపీ గా పని చేసిన జైలర్ 2 ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జైలర్ 2 కోసం వారు చేసిన అద్భుతమైన వర్క్ ను ప్రశంసించారు మెగాస్టార్.

ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.