యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్‌బాక్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సినీ ప్రియుల నుంచి సెన్సేషనల్ స్పందన లభిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చదువుపై విపరీతమైన ఆసక్తి ఉన్న ఒక పల్లెటూరి అమ్మాయి కలల ప్రయాణం, ఆ పచ్చని నేల నుంచి మొదలై ఏకంగా అంతరిక్షం వరకు ఎలా సాగింది అనే కాన్సెప్ట్‌తో ఈ టీజర్‌ను అత్యంత భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. దుల్కర్ సల్మాన్ తనదైన మేనరిజంతో ఆకట్టుకోగా, కథానాయికగా సాత్విక, కీలక పాత్రలో శృతి హాసన్ మెరిసి సినిమాపై హైప్‌ను మరింత పెంచేశారు.
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హార్ట్ టచింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్‌ను విజువల్ వండర్‌గా మార్చాయి. పవన్ సాధినేని విజనరీ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ విభిన్నమైన ఎమోషనల్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.నవంబర్ 20న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























