కామ్రేడ్ కళ్యాణ్.. రేపట్నుంచి కామెడీ కళ్యాణ్ అవుతాడు – కోన వెంకట్

Comrade Kalyan Will Become Comedy Kalyan from Tomorrow says Kona Venkat

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోన వెంకట్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈరోజు మా ‘కామ్రేడ్ కళ్యాణ్’.. రేపట్నుంచి ‘కామెడీ కళ్యాణ్’ అవుతాడు. అందరి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అందరి హీరోల ఫ్యాన్స్ కూడా శ్రీ విష్ణుని ఇష్టపడతారు. ‘అందరివాడు’ అనే టైటిల్‌ శ్రీ విష్ణు సరిపోతుంది. తను అందరి హీరోలతో, అందరి అభిమానులతో కూడా చాలా బాగుంటాడు. ప్రతి ఒక్కరూ మంచి కోరుకునే వ్యక్తి శ్రీ విష్ణు. ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చాయి. మేము రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రెండేళ్ల జర్నీ. ఈ సినిమా కోసం ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో తిరిగి చేశాం. ఎవరూ ఎక్స్ ఫ్లోర్ చేయని కొత్త లొకేషన్స్‌లో ఈ సినిమాని చేశాము. నిర్మాత కృష్ణకి ఇది ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్. ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించాడు. ప్రేక్షకులు కృష్ణకి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

శ్రీ విష్ణు సినిమా సినిమాకి తన ఆడియన్స్‌ని పెంచుకుంటున్నాడు. తను అందరి ఇళ్లల్లో ఉన్నాడు. తన కామెడీ టైమింగ్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. తను ప్రతి సినిమాని చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటాడు. శ్రీ విష్ణుతో మా కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. మెమరబుల్ సినిమా కావాలని, తన కెరీర్‌లో మోస్ట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఒక తీపి గుర్తులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ ఇలా ఎంతోమంది డైరెక్టర్లను నాకున్న శక్తితో పరిచయం చేశాను. ఇప్పుడు జానకిరామ్ ను పరిచయం చేస్తున్నాను. ఒక సక్సెస్‌కి చాలా శక్తి ఉంటుంది. అలాంటి శక్తిని మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా ‘కామ్రేడ్ కళ్యాణ్’ మీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.