ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం రియాలిటీ గ్లింప్స్

Kiran Abbavaram’s Reality Glimpse Impresses

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం ‘రియాలిటీ’ . ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌‌ను మేకర్స్ విడుదల చేయగా, ప్రేక్షకులలో మంచి స్పందన లభిస్తోంది. సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై ఈ గ్లింప్స్ పర్ఫెక్ట్ ఐడియాను ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం “ఆనందం వేజ్ అండ్ నాన్-వేజ్ హోటల్” నిర్వహించే ‘ఆనంద్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో ‘హై మోమెంట్’ (అత్యంత సంతోషకరమైన ఘట్టం) సాధించాలని కోరుకుంటారు. అయితే ఈ కథలోని ఆనంద్ జీవితంలో అతిపెద్ద హై మోమెంట్ ఏంటంటే.. తనకున్న అప్పులన్నింటినీ తీర్చేసి, అప్పుల బాధల నుంచి విముక్తి పొందడమే!

సగటు మానవుడికి అత్యంత దగ్గరగా, ఎంతో రిలేటబుల్‌గా ఉన్న ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా కిరణ్ అబ్బవరం పోషిస్తుండగా, ఈ చిత్రాన్ని సుధాకర్ ఛాగంటి నిర్మిస్తున్నారు. ఈ నయా కాన్సెప్ట్ డ్రామాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.డిసెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.