బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దృశ్యం 3’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదల కాకముందే నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లలో తొలిరోజే ఏకంగా 2.5 లక్షలకు పైగా (250K+) టికెట్లను విక్రయించి రికార్డు నమోదు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు మరో 12 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అజయ్ దేవగన్ సినీ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించబోతున్న చిత్రంగా ‘దృశ్యం 3’ నిలవబోతోందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
విజయ్ సల్గాంకర్ అండ్ ఫ్యామిలీ మిస్టరీకి ముగింపు కార్డు పడనున్న ఈ ‘ది కన్‌క్లూజన్’ ఎపిసోడ్‌పై నార్త్ ఆడియన్సులో భారీ అంచనాలు వున్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























