చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

Ranabaali Truth 1 – The Famine We Forgot Released

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ డ్రామా ‘రణబాలి’ నుంచి మేకర్స్ “Truth 1: The Famine We Forgot” పేరుతో ఓ ప్రత్యేకమైన బిహైండ్ ది సీన్స్/గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1876-1878 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనలో సంభవించిన తీవ్రమైన ‘గ్రేట్ మద్రాస్ కరువు’ (Great Madras Famine) నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ వెల్లడించారు. భారతీయులు ఆకలితో అలమటిస్తుంటే, ధాన్యాన్ని బ్రిటన్‌కు తరలించిన చారిత్రక సత్యాలను, ఆనాటి ప్రజల ఆవేదనను ఈ సినిమాలో బలంగా చూపించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ వీడియో వేదికగా మరోసారి స్పష్టం చేశారు.అలాగే ట్రూత్ : 2 గ్లింప్స్ ను ఈనెల 30న విడుదలచేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.