నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’.సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్ పై నాని చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి ‘ది ప్యారడైజ్’ కాకుండా మరో ప్రత్యామ్నాయ టైటిల్ పెట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ‘సమ్మక్క’ అని పెడితేనే పర్ఫెక్ట్గా సరిపోతుందని నాని వ్యాఖ్యానించారు.
ఇక ఈ చిత్రంలో నాని తల్లి పాత్ర పేరు సమ్మక్క అని, కథలో ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ (A) సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం 169 నిమిషాల నిడివితో థియేటర్లలో సందడి చేయనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























