ద్రావిడ గాన కోకిల, భారతరత్న ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అధికారికంగా ప్రారంభమైంది. మైలురాయిలా నిలిచే ఈ భారీ ప్రాజెక్ట్‌ను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా వేడుకగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్, బివి వర్క్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మైకేల్ జాక్సన్ బయోపిక్‌లో నటించే నటుడికి ఎంతటి ఒత్తిడి ఉంటుందో, ఎమ్ఎస్ అమ్మ పాత్ర పోషించడంలోనూ అంతే బాధ్యత, ఒత్తిడి ఉంటాయి. ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి గారు కేవలం సంగీతంలోనే కాకుండా, భారతదేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప ఐకాన్, పాన్-ఇండియా సూపర్‌స్టార్” అని కొనియాడారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ బయోపిక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇక మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి) భారతదేశంలోనే అత్యంత గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1998లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ పొందిన తొలి సంగీత కళాకారిణిగా, అలాగే 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారు.
ఆమె ఆలపించిన ‘భజ గోవిందం’, ‘కురై ఒండ్రుమ్ ఇల్లై’, ‘శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1968లో మ్యూజిక్ అకాడమీ నుంచి ‘సంగీత కళానిధి’ బిరుదు, 1974లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు, 1975లో పద్మవిభూషణ్ పురస్కారాలను ఆమె అందుకున్నారు.
10 ఏళ్ల వయసులో తొలి రికార్డింగ్ నుంచి 1997లో చివరి బహిరంగ సంగీత కచేరీ వరకు దాదాపు ఏడు పదుల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం, 2004లో చెన్నైలో తన 88వ ఏట ముగిసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























