వడ్డికాసులవాడ లో రవి మోహన్.. లార్డ్ గోవిందగా సర్‌ప్రైజ్

ravi mohan to play lord govinda in vaddi kaasulavaada

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ అప్‌కమింగ్ మూవీ ‘వడ్డికాసులవాడ’ నుంచి మేకర్స్ ఒక గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవి మోహన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వెంకటేశ్వర స్వామి చేయి ఒక సామాన్య మనిషి చేయిని పట్టుకున్నట్లుగా డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ముఖ్యమైన దైవ పాత్ర ద్వారా రవి మోహన్ తెలుగు తెరపై ఈ రీతిలో కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వినోదం మరియు బలమైన భావోద్వేగాల కలబోతగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ డిఫరెంట్ ఎంటర్‌టైనర్ తెలుగు ,తమిళ భాషల్లో ప్రేక్షకు ముందుకు రాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.