ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు ఆదిత్య హాసన్‌ను ప్రశంసిస్తూ, తన జీవితంలో ఎప్పుడూ సీరియల్స్ పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఈటీవీ వైపు చూడలేదని, అయితే ‘90s’ వెబ్ సిరీస్‌తో ఆదిత్య ఒక్కడే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చేత ఈటీవీ విన్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకునేలా చేశాడని విజయ్ అన్నారు. ఈ పిల్లోడు థియేట్రికల్ సినిమా తీస్తే టికెట్ కొని చూడాలని ఆరోజే అనుకున్నానని తెలిపారు. ఆదిత్య, నాగి, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా అందరూ తన మనుషులని, డైరెక్టర్ ఆదిత్యకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తమ్ముడు ఆనంద్ దేవరకొండ లైఫ్ జర్నీని గుర్తుచేసుకుంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నతనంలో పుట్టపర్తి హాస్టల్లో వదిలినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఆనంద్, అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు సొంతంగా తన దారిని ఏర్పాటు చేసుకుని నటుడిగా ఎదిగిన తీరును చూసి గర్వపడుతున్నానని చెప్పారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన సమయం నడుస్తోందని, దీనిని “ఆపరేషన్ TFI” అని పిలుచుకోవచ్చని విజయ్ వ్యాఖ్యానించారు. రాబోయే మూడు నెలల్లో ‘ఎపిక్’, నాని ‘ది ప్యారడైజ్’, తన ‘రణబాలి’, రష్మిక ‘ది మైసా’, ‘ఈ నగరానికి ఏమైంది 2’, ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘దాదా’ వంటి వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాబోతున్నాయని, ఈ ఏడాది టాలీవుడ్‌కి 100% స్ట్రైక్ రేట్ సాధించే సాలిడ్ ముగింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ రోమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























