ది ప్యారడైజ్ .. అదేం లేదు

The Paradise Release Date Remains Unchanged

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ముందస్తుగా ప్రకటించిన తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో వస్తున్న రెండవ చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల తేదీ మార్పుపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, మేకర్స్ ప్లాన్ చేసిన గడువుకే చిత్రాన్ని విడుదల చేసేందుకు వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ కొద్దీ రోజులనుండి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ, మేకర్స్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, సరికొత్త మాస్ షేడ్‌లో నాని కనిపించనున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మరియు ట్రైలర్ అప్‌డేట్‌ను అధికారికంగా అందించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.