వర్సటైల్ యాక్టర్ కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సెన్సార్ రన్‌టైమ్ 2 గంటల 59 నిమిషాలుగా నమోదైంది. మొదటి భాగం ‘సర్దార్’ మంచి ఘనవిజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రంలో కార్తీ ఏజెంట్ చంద్రబోస్ (సర్దార్) మరియు ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌లుగా ద్వంద్వ పాత్రల్లో అలరించనుండగా, విలన్‌గా ఎస్.జె. సూర్య నటించారు. ఇందులో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ మరియు రజిషా విజయన్ కథానాయికలు. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























