నాగార్జున బర్త్ డే సందర్భంగా గీతాంజలి రీ రీలీజ్

Geethanjali to Re-Release on Nagarjuna’s Birthday

కింగ్ నాగార్జున  ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి’ గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్‌తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి ‘గీతాంజలి’ని క్లాసిక్‌గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్‌గా నటించారు.

ఈసారి 4K ఫార్మాట్‌లో ‘గీతాంజలి’ని చూడటం ఈ రీ-రిలీజ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. మరింత క్లారిటీ, డీటెయిలింగ్‌తో విజువల్స్‌ను ప్రేక్షకులు కొత్త అనుభూతితో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది మరోసారి ఆ రోజులను గుర్తుచేసే నాస్టాల్జిక్ జర్నీ కానుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని నేటి జనరేషన్‌కు మాత్రం ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం దక్కనుంది. ఆగస్టు 28న 4Kలో ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.