మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక చాలా శ్రమ ఉంది. ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌ను పిలిచి వాళ్లతోనే చేయించడం జరిగింది. ఈ పాట థియేటర్‌లో ఒక తాండవంలా ఉంటుంది. ఇండియన్ సినిమాలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే ఒక ఫ్యామిలీ డ్రామాను ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా నేను చూడలేదు. ఇది నా గత సినిమాల్లాగా లైట్‌హార్టెడ్‌గా ఉంటుందని అనుకోవద్దు. చాలా సీరియస్‌గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషన్ ఉంటుంది. రవితేజ గారి సినిమాల్లో చాలా త్వరగా షూటింగ్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆయన గ్యాప్ తీసుకోరు, ఎవరికీ గ్యాప్ ఇవ్వరు. సీలేరులో అన్ని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం.
రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ గారు అందరూ ఈ కథను నమ్మి పనిచేశారు. రవితేజ లాంటి అద్భుతమైన పెర్ఫార్మర్‌తో ‘ఇరుముడి’ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్‌ను మరోసారి చూడాలనిపించేలా ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. ప్రియాకు ఇందులో మూడు సీన్లు ఉన్నాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు థియేటర్‌లో చూస్తారు. సాయికుమార్ గారు తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు. ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నక్షత్ర అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు వస్తాయి. రవితేజ గారికి, నక్షత్రకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాగే అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే జీవీ ప్రకాష్ కుమార్ గారి సంగీతాన్ని ఇష్టపడుతున్నాను. ఈ సినిమాకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేను. డీఓపీ విష్ణు శర్మ నా రైట్ హ్యాండ్. సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీరు ప్రత్యేకంగా రాస్తారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా సీరియస్ ఫిలిం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్‌తో పాటు గొప్ప ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకుని వస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























