మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకొని సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. కామెడీ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ మార్వెలస్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటించగా, నటుడు సత్య తనదైన టైమింగ్తో నవ్వుల పూవులు పూయించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు యువి క్రియేషన్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, మనోజ్ రెడ్డి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ను క్రిష్ సమర్పించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, సత్య జి. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
హాస్యంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ నాన్-స్టాప్ ఎంటర్టైనర్కు కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు వారాలు పూర్తవుతున్నా కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో చిత్రబృందం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈసినిమాతో వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























