VenkyAnil5 #NKRAR2లో ఆర్మీ ఆఫీసర్‌గా వెంకీ .. ఫస్ట్ లుక్ రిలీజ్

Victory Venkatesh’s First Look from #VenkyAnil5 and #NKRAR2 Released

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రస్థానంలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘#VenkyAnil5’ నుంచి వెంకటేష్ క్యారెక్టర్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు కమాండింగ్ అవతార్‌లో కనిపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో నందమూరి కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తుండగా , షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం స్పష్టం చేసింది.

జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జీ స్టూడియోస్ ఈ సినిమా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.