కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ .విడుదల డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ గ్రాండ్ ట్రైలర్ ఆగస్టు 7న విడుదల కానుంది. మరో 9 రోజుల్లో, అంటే స్వాత్రంత్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్ట్రెస్ రాధికా శరత్‌కుమార్, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ అత్యంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
‘సార్’, లక్కీ భాస్కర్ సినిమాలతో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య లాంటి మాస్ & క్లాస్ హీరో నటిస్తుండటంతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై పాన్-ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ నెలకొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























