యాక్షన్ హీరో విశాల్ నటిస్తూ, తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మకుటం’ (తమిళంలో ‘మగుడం’). సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి సమర్పణలో జీవా, జితన్ రమేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సినిమాపై మరింత క్రేజ్ పెంచేలా ఆఫీషియల్ ట్రైలర్‌ను ఆగస్టు 7న లాంచ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విశాల్ విభిన్న గెటప్పుల్లో కనిపిస్తుండగా, దుషారా విజయన్, అంజలి, జాన్ విజయ్, జయప్రకాష్, వంశీ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, రవి అరసు అందించిన కథకు విశాల్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు.టీజర్, సాంగ్స్‌కి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో విశాల్ కాంబోలో రాబోతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























