భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముంబైలోని ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బి.ఆర్.చోప్రా ఐకానిక్ సీరియల్ ‘మహాభారత్’లో అశ్వత్థామ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్, ఆ తర్వాత వెండితెరపై ప్రతినాయకుడిగా చెరగని ముద్ర వేశారు.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో ఆయన పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భయంకరమైన, పవర్‌ఫుల్ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ‘భద్ర’, ‘లక్ష్యం’, ‘స్టాలిన్’, ‘నెనొక్కడినే’, ‘లౌక్యం’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
తమిళం మరియు హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన ‘గజినీ’ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా మెప్పించారు. ఆమిర్ ఖాన్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ ‘లగాన్’ లో ‘దేవా’ పాత్రలోనూ ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























