కొరియన్ కనకరాజు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ –  వరుణ్ తేజ్

Korean Kanakaraju’ Is a Complete Comedy Entertainer says Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. ఆగస్టు 7న థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ. ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం.

ఈ సినిమా కొరియాలో షూట్ చేసినప్పటికీ భాష విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌లో కనిపిస్తాను. డైరెక్టర్ గారితో కలిసి ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేదానిపై మంచి హోంవర్క్ చేశాం. సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కథతో చాలా నేచురల్‌గా ట్రావెల్ అవుతాయి. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయి. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను.ఈ సినిమా చేయడం నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.