అంచనాలు పెంచేసిన కార్తి సర్దార్ 2 టీజర్

Karthi’s Sardar 2 Teaser Raises Expectations

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

“శాంతం… శాంతం… శాంతమే ప్రశాంతం… ఒక పొడుపు కథ చెబుతాను…” అంటూ ఎస్.జే. సూర్య పవర్‌ఫుల్ వాయిస్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. 

“ఇద్దరు గూఢచారులు… ఒకడు తండ్రి, ఒకడు కొడుకు… వాళ్ల టార్గెట్ నేనే. ఇప్పుడు గెలవబోయేది మంచి విలనా… చెడ్డ హీరోనా?” అంటూ ఎస్.జే. సూర్య చెప్పే డైలాగ్స్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఎస్.జే. సూర్య పాత్ర చుట్టూనే కథలో కాన్ఫ్లిక్ట్ ఉండబోతుందనే ఆసక్తిని మేకర్స్ క్రియేట్ చేశారు.

టీజర్ లో ‘సర్దార్’ ప్రపంచాన్ని భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్టైల్ ఫీల్‌ను తీసుకొస్తున్నాయి. 

కార్తి డబుల్ రోల్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ప్రతి షాట్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేసిన తీరు టీజర్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు అదనపు బలం చేకూర్చి, ప్రతి యాక్షన్ బ్లాక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

గ్రాండ్ విజువల్స్, రిచ్ సినిమాటోగ్రఫీ, అద్భుతమైన నిర్మాణ విలువలు సినిమాను అంతర్జాతీయ స్థాయి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.

మొత్తానికి, ‘సర్దార్ 2’ టీజర్… ఇంటెన్స్ యాక్షన్, హై వోల్టేజ్ స్పై డ్రామా, కార్తి-ఎస్.జే. సూర్య మధ్య కాన్ఫ్లిట్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. 

స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందనే సంకేతాలను టీజర్ బలంగా ఇచ్చింది.

ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.