ఇంట్రెస్టింగ్‌గా పళ్ళబురుసు టీజర్

Interesting Teaser of Pallaburusu Released

అక్కినేని నాగార్జునకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘పళ్ళబురుసు’ టీజర్‌ను యంగ్ హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ సాధారణ పల్లెటూర్లో 68 ఏళ్ల వృద్ధుడు (సుధాకర్ రెడ్డి) తన పళ్ళు తోముకోవడానికి వేపపుల్ల వల్ల పడే బాధ భరించలేక తన కొడుకును ఒక ‘పళ్ళబురుసు’ (టూత్ బ్రష్) కొనివ్వమని అడిగే చిన్న కోరిక, ఆ బ్రష్ చుట్టూ కోర్టు కేసులు, తండ్రీకొడుకుల గొడవలు మరియు గ్రామీణ రాజకీయాలు ఎలా తిరిగాయనేది వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా టీజర్‌లో చూపించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ రూరల్ కామెడీ అండ్ డ్రామా చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.