విక్టరీ వెంకటేష్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)’. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, మేకర్స్ వెంకటేష్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే సరదా పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ) తన భర్త చిట్టిబాబును ఆటపట్టిస్తూ చేసే వ్యాఖ్యలు, ఆ తర్వాత ఊహించని రీతిలో నారా రోహిత్ ఇచ్చే ఎంట్రీ వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. “ఇదిగోండి మన ఆదర్శ కుటుంబం” అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ భలే ఫన్నీగా వర్కౌట్ అయింది.
నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ తర్వాత త్రివిక్రమ్-వెంకటేష్ పూర్తిస్థాయి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
నివేథా పేతురాజ్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























