కామ్రేడ్ కళ్యాణ్ నుండి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ ఇంత ఇష్టమా సాంగ్ రిలీజ్

Intha Istamaa Lyrical song from Comrade Kalyan out now

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట ‘ఇంత ఇష్టమా’ ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మెస్మరైజ్ అయ్యి అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు.

భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ యాక్షన్, భావోద్వేగాలు,  ఆకట్టుకునే ప్రేమకథ కలగలిపిన చిత్రంగా రూపొందుతోంది.

ఈ రెండో పాటలో లీడ్ పెయిర్ మధ్య చిగురించే ప్రేమను, సరిహద్దులను దాటే అమాయకమైన అనుబంధాన్ని అందంగా చూపించారు.ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.’కామ్రేడ్ కళ్యాణ్’ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.